ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా భయం వారిలో ఇంకా పోలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 20, 2022, 01:04 PM

కాకినాడ జిల్లాలోని, కాజులూరు మండలం కుయ్యరు గ్రామంలో వింత వెలుగులోకి వచ్చింది. గత నాలుగు సంవత్సరాల నుంచి తల్లీ, కూతుళ్లు ఇంటికే పరిమితమయ్యారు. కరోనా సమయంలో బయటికి రాకూడదు అని తల్లి మణి, కూతురు దుర్గాభవాని భయాన్ని పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇంట్లో ఒక హాల్‌లోనే తల్లీకూతుర్లు ఉండిపోయారు. తండ్రి అప్పుడప్పుడు భోజనం ఇచ్చేవారు. బయటకు వస్తే కరోనా వస్తుంది అనే భయంతో తల్లీకూతుర్లు వణికిపోతున్నారు. దుప్పటి కప్పుకుని అందులోనే ఉండిపోయారు. కిటికీలోంచి ఎవరు మాట్లాడినా కూతురు దుప్పటి లోపలే ఉండి సమాధానం చెబుతోంది. విషయం తెలిసిన వైద్య సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని బయట తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. తల్లి కూతుర్ని చూసి సుమారు రెండు సంవత్సరాల అయ్యుంటుందని స్థానికులు చెబుతున్నారు. వారం రోజుల నుంచి తండ్రిని కూడా ఇద్దరూ ఇంటి లోపలికి రానివ్వని పరిస్థితి. ఈ క్రమంలో తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వైద్య సిబ్బంది ఇంటి లోపలికి వెళ్లి బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా అందుకు తల్లీకూతుళ్లు నిరాకరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com