ఏపీ మంత్రి అంబటి రాంబాబు బాధితుల విషయంపై జనసేన నేతలు బోనబొయిన శ్రీనివాస యాదవ్, గాదె వెంకటేశ్వర రావు స్పందించారు. ‘‘అయ్యా అంబటి ఎక్కడ దాక్కున్నావ్.. ఎక్కడికి పారిపోయావు. లంచం డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా అన్నావు. ఇదిగో నీ లంచాల బాగోతం నిరూపించాం. ఎప్పుడు రాజీనామా చేస్తావో చెప్పు. రేపల్లె నుంచి పారిపోయి వచ్చినట్లు సత్తెనపల్లి నుంచి కూడా పారిపోయావా. తురకా మంగమ్మ దంపతులకు తక్షణమే పరిహారం చెక్కు ఇవ్వాలి. సాయంత్రంలోపు ఇవ్వకపోతే ఆర్డీఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేస్తాం.అవసరమైతే జనసేన ఆమరణ నిరహార దీక్ష చేస్తాం. మంగమ్మ దంపతులకు ఏదైన హానీ జరిగితే అంబటి రాంబాబు దే బాధ్యత. మంగమ్మ కుటుంబానికి జనసేన అండగా ఉంటుంది’’ అంటూ జనసేన నేతలు స్పష్టం చేశారు.