గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి నీటి విడుదల కొనసాగుతుంది. మంగళవారం 9వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు డి ఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. చాగల్ల , సిబిఆర్ రిజర్వాయర్ నుంచి 9వేల క్యూసెక్కుల ద్వారా గండికోట ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుందన్నారు. గండికోట ప్రాజెక్టులో నీటిమట్టం ప్రస్తుతం పూర్తిస్థాయికి దగ్గర్లో ఉన్నందున వచ్చే నీటిని యధాతధంగా మైలవరం జలాశయానికి వదులుతున్నామన్నారు. ప్రస్తుతం గండికోట ప్రాజెక్టులో 26. 70 టీఎంసీల నీరు నిలువ ఉన్నట్లు డిఈ తెలిపారు. కాగా మైలవరం జలాశయం నుంచి 6 వేల క్యూసెక్కుల నీటిని పెన్నా నదికి వదులుతున్నట్టు జలాశయ డి ఈఈ నరసింహ మూర్తి తెలిపారు. గండికోట జలాశయం నుంచి 10వేల క్యూసెక్కుల మేర నీరు వచ్చి మైలవరంలో చేరుతుండగా ఉత్తర కాలువకు 108 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మైలవరం జలాశయంలో 6. 100 టీఎంసీల నీరు నిల్వ ఉంది.