ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాయచోటి లో ఈరోజు అనగా మంగళవారం ఉదయం ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా హర్షలతా పంకజ్ గారు యువత చైతన్యం తో ఈ మానవ అక్రమ రవాణా, స్త్రీల పై అఘాయిత్యాల నిర్మూలన లో యువత మెలకువ గా ఉండాలని తెలిపారు. మానవ అక్రమ రవాణా పై ఛత్తీస్ ఘడ్ లో శిక్షణ పొందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల బి. ఎ. మొదటి సంవత్సరం విద్యార్థి బాదుల్లా ఈ సదస్సులో తన అనుభవాలను తోటి విద్యార్థులకు సాంస్కృతిక ప్రదర్శన మరియు నృత్య రూపకము ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా మునియా నాయక్, శ్రీ గుర్రప్ప గారు అవగాహన కల్పించారు. ఎన్. ఎస్. ఎస్ ఆఫీసర్ డా. ఫరూఖ్ భాషా, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.