ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ఆహార విజ్ఞాన శాస్త్ర సాంకేతిక పరిశోధన కళాశాల ఆవరణలో మంగళవారం మునిసిపల్ ఇన్ ఛార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్, కళాశాల డీన్ సర్దార్ భేగ్, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ గంగాధర్ రెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్ హఫీజ్, స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు ల చేతులమీదుగా మొక్కలు నాటి, నీరు పోశారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ లు, కళాశాల అసిస్టెంట్ అసోషియేట్ ఏడు కొండలు, అధ్యాపక బృందం అరుణ, జయమ్మ, నజ్మా, రాజేష్, శ్రీనివాసులు, రవితేజ, రాజశేఖర్, రామసుబ్బారెడ్డి, కళాశాల విద్యార్థులు మరియు సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.