మొక్కలు విరివిగా నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, వైసిపి అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధి శిబ్యాల విజయభాస్కర్ మంగళవారం అన్నారు. నవరత్నాలు సుస్టికర్త రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రాయచోటి మండల పరిధిలోని శిబ్యాల గ్రామకస్పా లో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణంలో విజయభాస్కర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడంతో పాటు పాఠశాల విద్యార్థుల మధ్య వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ముందస్తు వేడుకలను జరుపుకునే కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.
అలాగే గ్రామపంచాయతీలోని అన్ని పల్లెలకు సుమారు 1000 కి పైగా పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పరిధిలోని ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అలాగే అలాగే బుధవారం జగన్ పుట్టినరోజు పురస్కరించుకొని వైసిపి నేతలతో పాటు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేగాక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి లో జరిగే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా రాయచోటి నియోజకవర్గాన్ని స్వచ్ఛ రాయిచోటిగా తయారు చేయడమే కాకుండా భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని, కాలుష్యం లేని గాలిని అందిద్దామని ఆయన అన్నారు.