ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మైదుకూరు నియోజవర్గంలోని తహసిల్దార్ ఆఫీస్ వద్ద జిల్లా నాయకులు జయచంద్ర మాదిగ అధ్యక్షతన ఒక్కరోజు మహా దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ వెంకటేష్ మాదిగ, ఎంఎస్పి మండల కన్వీనర్ సునీల్ మాదిగ మాట్లాడుతూ. ఎస్సీ వర్గీకరణ కోసం గత సుమారు 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని అయినప్పటికీ ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు.
బిజెపి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణ చేసి పెడతామని చెప్పి మాట ఇచ్చి ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్న వర్గీకరణ కోసం ఒక మాట కూడా మాట్లాడలేదని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాలోనే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో ఢిల్లీని ముట్టడి చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా ఇంచార్జి నరసింహ మాదిగ, ఎంఎస్పి ఖాజీపేట మండల కన్వీనర్ రాజా మాదిగ, ఎమ్మార్పీఎస్ ఖాజీపేట మండల కన్వీనర్ లు రమణ మాదిగ, భాస్కర్ మాదిగ, ఎం ఎస్ పి నాయకులు జయరాముడు మాదిగ, మరియన్న మాదిగ, ఓబన్న మాదిగ, నారాయణ మాదిగ, వెంకటేష్ మాదిగ బ్రహ్మంగారిమఠం ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ జ్ఞానేశ్వర్ మాదిగ, షేక్ నజీర్ (ముస్లిం మైనార్టీ) విజయ్ కుమార్(మాల), సుబ్బయ్య (మాల) , దొరబాబు మాదిగ, శివ మాదిగ బాలవేంకటయ్య మాదిగ , నాని మాదిగ, రవి మాదిగ తదితరులు పాల్గొన్నారు.