ఆమదాలవలస మండల ముగ్గుల పోటీ విజేతలకు గ్రామ సంఘాల స్థాయిలో ప్రధమ , ద్వితీయ, తృతీయ , బహుమతులు స్థానిక సర్పంచుల ఆధ్వర్యంలో అందించినట్లు వైయస్సార్ క్రాంతి పదం అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ పైడి కూర్మారావు తెలిపారు. మంగళవారం గ్రామస్థాయిలో విజేతలు అందరిని మండల స్థాయి పోటీలకు ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. మండల స్థాయి విజేతలను గుర్తించి ఆమదాలవలస ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన నియోజకవర్గస్థాయి ముగ్గుల పోటీలు , పాటల పోటీలు, మ్యూజికల్ చైర్స్ , తదితర పోటీలలో పాల్గొని స్పీకర్ చేతుల మీదగా బహుమతులు అందుకొనున్నట్లు తెలిపారు. వంజంగి సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసిన పోటీలలో విజేతలకు వంజంగి సర్పంచ్ బెండి సత్యవతి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్జిగా హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వ్యవహరించినట్లు తెలిపారు. అలాగే మండల మహిళా సమైక్య సంఘ కార్యాలయం వద్ద మండల స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేస్తారని తెలిపారు.