ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపు మేరకు మంగళవారం నరసన్నపేట నియోజకవర్గంలో విస్తారంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. తొలుత పోలాకి మండలంలోని మబగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్, స్థానిక జడ్పిటిసి డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య తదితరులు మొక్కలు నాటారు. అక్కడే విద్యార్థులకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. అలాగే నరసన్నపేట మండల పరిషత్ ప్రాంగణం లో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతురామారావు, వైస్ ఎంపీపీ, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు , సర్పంచ్ లు, ఎంపీటీసీలతో కలిసి కృష్ణదాస్ మొక్కలు నాటారు.