ఇటీవల నూతనంగా ఎన్నికైన శ్రీకాకుళం జిల్లా, టౌన్ ఎన్జీఓ కార్యవర్గ సభ్యులు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖమాత్యులు ధర్మాన ప్రసాదరావును మంగళవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర సహధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు, జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం నేతృత్వంలో ధర్మానను కలిసి పుష్పగుచ్చం అందజేసిన అభినందనలు తెలిపారు. ఈరోజు సందర్బంగా మంత్రి ధర్మాన నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కొరకు సంఘ నేతలు చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రభుత్వానికి ప్రజలకు ఉద్యోగులు వారసులని, ప్రభుత్వ పాలనకి ఉద్యోగులు సహకరించాలని కోరారు. ఉద్యోగులు, ఎన్జీఓ సంఘ నేతలకు తనవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా వుంటాయని ధర్మాన హామీనిచ్చారు. మంత్రిని కలసిన వారిలో జిల్లా, టౌన్ సంఘ నేతలు చల్లా శ్రీనివాసరావు, రాయి వేణుగోపాలరావు, బడగల పూర్ణచంద్రరావు, ఆర్. గోవింద పట్నాయక్, బొత్స శ్రీనివాసరావు, నవీన్, శ్రీరామ్ కుమార్, భూపాలరావు, రత్నకుమార్, కె. రోజాకుమారి, జి. లలిత, నారాయణమ్మ, మమతాకుమారి తదితరులు వున్నారు.