దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయిస. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభాన్ని నమోదు చేసి ప్రస్తుతం ఫ్లాట్ గా ట్రేడవుతోంది. సెన్సెక్స్ 61,776 పాయింట్లు, నిఫ్టీ 18,401 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ, ఫైనాన్స్, రియాల్టీ రంగాలు 0.5 శాతం లాభాలను నమోదు చేశాయి. హెచ్ సీఎల్, యాక్సిస్ బ్యాంకు, విప్రో, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.