ఏపీ ప్రభుత్వం భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని నిషేధించింది. ఈ పదాన్ని నిషేధించాలంటూ పలు బీసీ సంఘాల విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలు, టీవీ సీరియల్లు, రాజకీయ వేదికలు, బహిరంగ సభల్లో తరచుగా వాడే ఈ పదాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ఈ పదాన్ని వాడే వారిపై ఇండియన్ పీనల్ కోడ్-1860 కింద చట్టప్రకారం చర్యలు తీలుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa