ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొప్ప మనసు చాటుకున్న టీచర్.. రూ.55 లక్షలు వచ్చాయి

national |  Suryaa Desk  | Published : Wed, Dec 21, 2022, 03:14 PM

ఓ టీచర్ చేసిన సాయం వల్ల ఓ నిరుపేద కుటుంబానికి రూ.55 లక్షల విరాళం అందింది. ఈ ఘటన కేరళలో జరిగింది. సుభద్ర(55) అనే మహిళ భర్త ఆగస్టులో చనిపోయారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త చనిపోవడంతో పిల్లల ఆకలి తీర్చడం కష్టంగా మారింది. సుభద్ర తన కొడుకు క్లాస్ టీచర్ ను రూ.500 సాయం కావాలని అడిగింది. దీంతో సుభద్రకు ఆ టీచర్ రూ.1000 ఇచ్చింది. అంతేకాకుండా సుభద్ర కుటుంబ పరిస్థితిని వివరిస్తూ ఆ టీచర్ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టింది. బ్యాంకు వివరాలతో పోస్ట్ పెట్టి సాయం చేయాలని కోరింది. ఆ పోస్టు వైరల్ కావడంతో రూ.55 లక్షల ఆర్థికసాయం సుభద్ర కుటుంబానికి అందింది. ఈ డబ్బులతో తమ కుటుంబ కష్టాలు తీరుతాయని సుభద్ర తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com