పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టీడీపీ నేత ఇబ్రహీం మృతి పట్ల ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. వైసీపీనే ఇబ్రహీంను హత్య చేసిందని టీడీపీ నేతలు నసీర్ ఆహ్మధ్, చదలవాడ అరవింద్ బాబు, నల్లపాటి రాము ఆరోపించారు. డౌన్ డౌన్ గోపిరెడ్డి అంటూ నినాదాలు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని... నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.