పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కి సంబంధించిన ఓ అసభ్య ఆడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఇమ్రాన్ ఓ మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతున్నట్లు భావిస్తున్న 2 ఆడియో క్లిప్‌లను జర్నలిస్టు సయీద్ అలీ హైదరీ విడుదల చేశాడు. ఈ లీక్ చేసిన కాల్స్‌లో ఓ వ్యక్తి మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా కలవాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా ఉంది. దానికి ఆమె అయిష్టంగానే అతడితో మాట్లాడుతూ బాధలో ఉన్నట్లు చెప్పింది. మరుసటి రోజు కలవటం గురించి ఆ కాల్లో వారిద్దరూ మాట్లాడుకున్నారు. కాగా ఈ ఘటనపై ఇమ్రాన్‌కు చెందిన తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ స్పందించింది. అవన్నీ తప్పుడు ఆడియో క్లిప్లని పేర్కొంది. ఇమ్రాన్‌ను లక్ష్యంగా చేసుకొని అటువంటి ఆడియో, వీడియో క్లిప్‌లను ప్రభుత్వం ప్రచారం చేస్తోందని ఆరోపించింది.