చాలా కాలంగా చర్చనీయాంశమైన విశాఖ రైల్వేజోన్ వ్యవహారంపై రైల్వే బోర్డు వివరణ ఇచ్చింది. కొత్త జోన్ ఏర్పాటు, నిర్వహణ, కార్యకలాపాలకు పరిమితి లేదని వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్, రాయగడ డివిజన్ ఏర్పాటుకు 2020-21లో రూ.170 కోట్లు కేటాయించినట్లు రైల్వే బోర్డు తెలిపింది.రూ.106 కోట్లతో విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో భాగంగా రాయగడ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. 2022-23లో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కు రూ.6 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కాజీపేటను కొత్త డివిజన్ చేసే ప్రతిపాదన లేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.