భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 635 పాయింట్లు నష్టపోయి 61,067 వద్ద ముగిసింది. నిఫ్టీ 185 పాయింట్లు నష్టపోయి 18,199 వద్ద స్థిరపడింది.ఈ క్రమంలో ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో లాభాల బాటలో పయనించిన సూచీలు.. ఆ తర్వాత పతనం దిశగా సాగాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ సుజుకీ ఇండియా, ఆల్టాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.