కేంద్రమంత్రి అమిత్ షా తనను, తన కుటుంబాన్ని కాపాడాలంటూ వైకాపా నేత సుబ్బారావు గుప్తా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. "రాష్ట్రంలోని అవినీతి, నాయకుల తీరును గతంలో మాజీ మంత్రి బాలినేని జన్మదిన వేడుకల్లో విమర్శించాను. దీంతో బాలినేని అనుచరులు నన్ను వేధిస్తున్నారు. గుంటూరులోని ఓ లాడ్జిలో ఉంటే అక్కడికి వచ్చి నన్ను చిత్రహింసలు పెట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిందితులకు నోటీసులిచ్చి వదిలేసారు" అని తెలిపారు. నాతో పాటు నా కుటుంబ సభ్యులను కూడా చంపాలని చూస్తున్నారు. అమిత్ షా గారూ కాపాడండి అంటూ బ్యానర్ తో నిరసన తెలిపారు. ఇంతలో అక్కడికి వచ్చిన టీటౌన్ సీఐ రాఘవరావు సుబ్బారావు చేతిలోని బ్యానర్ తొలగించి అక్కడినుండి పంపించేశారు.