ఏపీ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేవాలయాల్లో నిర్వహించే అన్నదానంలో భక్తలకు అరటాకులు లేదా విస్తరాకుల్లో మాత్రమే వడ్డించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని దేవాలయాల ఈఓలకు దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇప్పటికీ కొన్ని ఆలయాల్లో స్టీల్ ప్లేట్లలో అన్నదానం చేస్తున్నారు. అన్నదానం పేరుతో అందజేసే ఆహారానికి మరింత పవిత్రతను కల్పించేందుకే అరిటాకు, విస్తరాకుల్లో వడ్డించాలని నిర్ణయించారు. ఇటీవలే అన్నవరం దేవస్థానం సైతం అరిటాకుల్లో కాకుండా ప్లేట్లలో వడ్డించాలని నిర్ణయించింది. తాజా ఆదేశాలతో అరిటాకుల్లోనే అన్నదానం కొనసాగనుంది.