పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలో సదుపాయాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎక్స్‌రే యూనిట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. రోగుల సౌకర్యార్థం ఎక్స్‌రే కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. చిన్న చిన్న ఎక్స్‌రేలకు బయటకు వెళ్లే పని ఉండదని, ఆస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మన్నే సుందరరావు, డాక్టర్ శారమ్మ, సర్పంచ్ నిడమర్తి సౌజన్య, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ గౌసాని, ఎంపీటీసీ సభ్యుడు మద్దినేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.