పార్టీ కోసం పని చేసిన వారికి సముచిత స్థానం తప్పక కల్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులలో విద్యనభ్యసిస్తున్న 8 వ తరగతి విద్యార్థుల కు బైజూస్ ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు చుండూరు మండలం ఎడవల్లి కి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొన్నూరు ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ నాజర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి పూల బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పొన్నూరు లో పార్టీ బలోపేతానికి పని చేయాలి, ముస్లిం మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం నాజర్ తో అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసం పని చేయాలని కోరారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన సీనియర్లకు పదవులు ఇస్తామన్నారు.