విజయనగరం జిల్లాలో పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు గడువు ఈ నెల 24 వరకూ పెంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌డీవీ రమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుం లేకుండా రూ. 125 ఫీజు చెల్లించాలన్నారు. రూ. 50 అపరాధ రుసుంతో ఈనెల 29 తేదీ వరకు, రూ.200తో జనవరి 3, రూ.500తో అదేనెల 9వ తేదీ వరకూ పది పరీక్ష ఫీజు చెల్లించొచ్చని పేర్కొన్నారు. సంబంధిత పత్రాలతో ఆయా తేదీల్లో ఎన్‌ఆర్ ఆన్‌లైన్‌లో మాన్యువల్ హార్డ్ కాపీలను ఇవ్వాలని సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి హెచ్‌ఎంలు నామినల్ రోల్స్‌ను ఈ నెల 29 నుంచి జనవరి 9 లోగా అందించాలన్నారు. డీఈవో కార్యాలయం నుంచి డీజీవో కార్యాలయానికి జనవరి 11 లోగా పంపించనున్నట్లు వివరించారు. హెచ్‌ఎంలందరూ పది పరీక్ష ఫీజును వెబ్‌సైట్ నుంచి పాఠశాల లాగిన్‌లో చెల్లించాలని సూచించారు.