బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండల పరిధిలోని యడ్లపల్లి గ్రామంలో బుధవారం ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో సీఎం ని దివ్యంగులు కలిసి తమ ఇబ్బందులు వివరించిన మోదుకూరు గ్రామానికి చెందిన గుండ్రెడ్డి వెంకటరెడ్డి, వలివేరు గ్రామానికి చెందిన కూచిపూడి విద్యాసాగర్ లు తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. దాంతో స్పందించిన సీఎం, ప్రభుత్వం తరపున సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ముగ్గురు దివ్యాంగులకు చెక్కులు అందజేసిన బాపట్ల జిల్లా కలెక్టర్ కే. విజయకృష్ణన్