గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మహారాష్ట్ర నాగపూర్ కు చెందిన సూరజ్ గులాబ్ సింగ్ ఈనెల 12వ తేదీన రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. స్థానికులు 108 సహాయంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. అత్యవసర విభాగంలో వైద్య పరీక్షలు చేసి రోగిని ఎముకలు కీళ్ల విభాగానికి పంపించారు. ఎముకల కీళ్ల విభాగం రెండో యూనిట్ ప్రొఫెసర్ డా. దాసరి వెంకటేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. బి సింధూరం, డా. రవి, డా. సుస్మితలు రోగికి శస్త్రచికిత్స చేశారు. బుధవారం రోగి కోలుకొని ఇంటికి వెళ్తున్న సందర్భంగా వివరాలను ఆసుపత్రి అధికారులు మీడియాకు వివరించారు. రోగికి జిజిహెచ్ వైద్యులు ప్రయాణ ఖర్చులు అందజేసి మానవత్వం చాటుకున్నారు.