టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి(28) పెళ్లి కార్డుల పంపిణీకి వెళ్లి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ధర్మారెడ్డి కుమారుడి అంత్యక్రియలు స్వగ్రామంలో జరిగాయి. ఈ నేపథ్యంలో తీవ్ర విషాదంలో ఉన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని సీఎం జగన్ పరామర్శించారు. సీఎం జగన్ ఈరోజు నంద్యాల జిల్లా పారుమంచల్కు వెళ్లారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి తనయుడు చంద్రమౌళి చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం ధర్మారెడ్డి, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలన్నారు.