విజయనగరం వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా కోగునూరులో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని, ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ ఇంటికేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలు చెబుతుంటే తనపై మరింత బాధ్యత పెరిగిందని అర్థమైందని వివరించారు. ఇంటికొకరు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.