రైల్వేకోడూరు పట్టణం చిట్వేల్ రోడ్ నందు గల విస్డం విద్యాసంస్థల ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైల్వేకోడూర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మెహన్ రావ్ ముఖ్య ఆతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ విశిష్టతను పిల్లలకు వివరించారు. పాఠశాల విద్యా సంస్థల కరస్పాండెంట్ ప్రదీప్ పిల్లలకు యేసుక్రీస్తు జీవిత చరిత్రను వివరించారు. తదనంతరం క్రిస్మస్ కేకును కట్ చేసి పిల్లలకు పంచారు. పాఠశాల విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమం నందు విద్యాసంస్థల డైరెక్టర్ మదన్మోహన్, ప్రిన్సిపాల్ ప్రియంక పాఠశాల సిబ్బంది పాల్గోన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa