విశాఖలో రౌడీషీటర్స్ బీభత్సం సృష్టించారు. నడిరోడ్డుపైనే పోలీసులు దూషిస్తూ రెచ్చిపోయారు. మారణాయుధాలతో పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. ‘మమ్మల్ని పోలీసులు ఏం పీకలేరు’ అంటూ రెచ్చిపోయారు. విశాఖ వన్టైన్ పాండా వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టికి వెళ్లింది. దీనిపై విశాఖ సీపీ శ్రీకాంత్ సీరియస్ అయ్యారు. వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసులను రంగంలోకి దింపారు. ఎట్టకేలకు పోలీసులు సదరు రౌడీ షీటర్‌తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. నిజానికి నగరంలో ఎక్కడపడితే అక్కడ గంజాయి, డ్రగ్స్ సేవిస్తున్నట్టు సమాచారం అందుతున్నా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చివరకు ఈ గ్యాంగ్ సభ్యులు పోలీసులకే సవాల్ విసిరే స్థాయికి ఎదిగిపోయారు.