తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలం కడియపులంకలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఇంటికి వెళ్లి సుత్తితో తల్లి, ఇద్దరు కూతుర్లపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో తల్లీకూతుళ్లు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రేమోన్మాది పొట్టిలంక గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. తల్లీ, కూతుర్లపై దాడి చేసిన అనంతరం ప్రేమోన్మాది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ప్రేమోన్మాదిని మరో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.