ట్రెండింగ్
Epaper    English    தமிழ்

175 సీట్లు ఇస్తే ఇళ్లల్లో కూడా ఉండనీరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 26, 2022, 07:02 PM

పేద ప్రజలకు అండగా నిలిచేది పేదల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ ఒకటే అని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. సోమవారం సుండుపల్లి మండల కేంద్రానికి సమీపంలోని బుర్రలదిన్నెపల్లి హరిజనవాడకు చెందిన దళిత రైతు లక్ష్మీదేవికి చెందిన మామిడి తోటను అధికార పార్టీ చెందిన నాయకులు నరికేయడం దారుణం అని అన్నారు. నష్టపోయిన మహిళా రైతుకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 100 మామిడి చెట్లను ఇవ్వడం సంతోషదాయకం అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతుందని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో 175 కు 175 స్థానాలు మనకి అని సంకలు గుద్దుకుంటున్నారు.


ఈ సారి ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజలు ఇండ్లలో కూడా ఉండే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఇప్పటికే దళితులు గిరిజనుల పైన తారాస్థాయిలో దాడులు జరుగుతున్నాయని తెలియపరిచారు. 100 మామిడి చెట్లను అధికార పార్టీ నాయకులు తమ స్వలాభం కోసం నరికేసారంటే అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. మామిడి చెట్లు కోల్పోయిన బాధితురాలికి మద్దతుగా ఎంపీ స్పందించడం మంచి పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు విశ్వనాథ్ నాయక్, జిల్లా సహాయ కార్యదర్శి మహేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు శివరామకృష్ణదేవరా, లంబాడ సంఘం జాతీయ నాయకులు మూడే శంకర్ నాయక్ బీసీ నాయకులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com