తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం కింద 13 మంది యువకులకు విదేశీ ఉద్యోగావకాశాలు కల్పించారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ఉత్తీర్ణులైన 13 మంది విద్యార్థులు అమెరికాలోని వివిధ అంతర్జాతీయ స్థాయి హోటళ్లలో ఉద్యోగాలు పొందారు.తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం ఇటీవల ఉపాధ్యాయులు, ఎంబీఏ, ఇంజినీరింగ్ తదితర టెక్నికల్ కోర్సుల్లో విద్యార్థులకు ఉచితంగా జాబ్ ఓరియెంటెడ్ శిక్షణ, ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా... ముందుగా 13 మంది హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డీ విభాగం చైర్మన్ రామాంజనేయులు, పార్టీ ఎన్నారై విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ వేమూరు రవికుమార్‌తో కలిసి ఉద్యోగాలు పొందిన విద్యార్థులను అభినందించారు. వారికి ఉద్యోగాల భర్తీకి ఆఫర్ లెటర్లు అందజేశారు.