ఏపీలో మరో ఏడాదిన్నరలో జరగనున్న ఎన్నికల దృష్ట్యా రేపు టీడీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం-ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఈ సదస్సు జరుగుతోంది. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధ్యక్షత వహించనున్నారు. కాగా, ఈ అఖిలపక్ష సమావేశానికి అధికార వైసీపీ మినహా అన్ని పార్టీలకు ఆహ్వానం అందింది. ఈ సభ ఏర్పాట్లను బోండా ఉమ, అశోక్ బాబు, టీడీ జనార్దన్ పరిశీలించారు.