ఓమిక్రాన్ బీఎఫ్-7 సబ్ వేరియంట్ వల్ల పొంచి ఉన్న ముప్పుపై నిపుణుల హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను మళ్లీ తెరపైకి తెచ్చింది. పాఠశాలలు, కళాశాలలు, థియేటర్లలో మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కేశవ సుధాకర్ వెల్లడించారు.నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్ లు, రెస్టారెంట్లు, బార్లలో కచ్చితంగా మాస్కులు ధరించాలని, నూతన సంవత్సర వేడుకలు రాత్రి ఒంటి గంట లోపే ముగించాలని స్పష్టం చేశారు.