భారత ఆర్మీ తదుపరి ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అరవింద్ వాలియా నియమితులయ్యారు. డిసెంబరు 31న పదవీ విరమణ పొందిన లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టనున్నరు. 1986 బ్యాచ్‌కు చెందిన అధికారి, లెఫ్టినెంట్ జనరల్ వాలియా డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ పూర్వ విద్యార్థి మరియు అక్కడ ప్రతిష్టాత్మక రజత పతకాన్ని కూడా అందుకున్నారు. లెఫ్టినెంట్ జనరల్ వాలియా గతంలో ఎడారి సెక్టార్‌లో స్వతంత్ర స్క్వాడ్రన్‌కు, జమ్మూ కాశ్మీర్‌లోని రెజిమెంట్‌కు మరియు వెస్ట్రన్ ఫ్రంట్‌లో ఇంజనీర్ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించారు.