ఏపీ ప్రభుత్వం సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. సచివాలయం, హెచ్వోడీలు, కలెక్టర్ కార్యాలయాల్లోని ఉద్యోగులు సహా అన్ని కేడర్లకు ఫేస్ రికగ్నిషన్ హాజరు తప్పనిసరి చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జనవరి 21 నుంచి సచివాలయం, అన్ని శాఖల హెచ్వోలు, జిల్లా అధికారులు, ఇతర అన్ని కేడర్ల ఉద్యోగులకు జనవరి 16 నుంచి ఫేస్ రికగ్నిషన్ హాజరు అమలు కానుంది.