ఏపీ సీఎం జగన్ సోమవారం వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షించారు. కోవిడ్ విజిలెన్స్‌పై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండి కోవిడ్ టెస్టింగ్ కిట్‌లను అందుబాటులో ఉంచాలి. సరిపడా ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల సన్నద్ధతను పరిశీలించి, ఈ ప్రక్రియను జనవరి 5, 2023 నాటికి పూర్తి చేయాలని, అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.