రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరికీ ముఖ ఆధారిత హాజరును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల ఉద్యోగులందరికీ ఈ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. జిల్లా స్థాయి కంటే కింది స్థాయిలో ఉన్న ఆఫీసులు, డివిజన్, మండల, గ్రామ స్థాయి కార్యాలయాల్లో ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో సహా ఉద్యోగులందరికీ జనవరి 16 నుంచి ముఖ ఆధారిత హాజరు అమలు చేయాలని సూచించింది. వీటితోపాటు స్థానిక సంస్థలు, మండల, గ్రామ స్థాయి కార్యాలయాలు, విలేజ్‌వార్డు సచివాలయాల్లో కూడా ముఖ ఆధారిత హాజరును అమలు చేయాలని ఆదేశించింది. దీనిద్వారానే ఉద్యోగుల సెలవులను గణించాలని పేర్కొంది. ఈ ఆఫీస్, బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అన్ని ఆఫీసుల్లోనూ అమలు చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. అమరావతి సచివాలయంలోని వివిధశాఖల ఉద్యోగులకు ఇప్పటికే ఈ విధానం అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనిలోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులందరి కోసం ముఖ ఆధారిత హాజరు యాప్‌ను తయారు చేయాలని ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ (ఐటీఈ అండ్‌సీ)ను ప్రభుత్వం ఆదేశించింది. మొబైల్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని అటెండెన్స్ వేసే విధంగా ఏపీసీఎ్‌ఫఎ్‌సఎస్ యాప్‌ను డెవలప్ చేయాలని ప్రభుత్వం ఆశాఖను ఆదేశించింది. ముఖ ఆధారిత హాజరు విధానం అమలును నోడల్ ఏజెన్సీగా ఐటీఈ అండ్‌సీ శాఖను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.