జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో వింతపోకడలు చూస్తున్నామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కి చెందిన 26 పథకాలను వెంటనే అమలు చేయాలని సోమవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్‌రెడ్డి చాక్లెట్లు పంచి రాష్ట్రాన్ని దోచుకుంటూ తన తాత సొమ్ము ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాడు. కేంద్రం ఇచ్చే సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించే హక్కు ఎవరిచ్చారు? పాత పథకాలన్నీ రద్దు చేసి అమ్మఒడి ఇస్తున్నాననడం సరికాదు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడే తీరు తలవంచుకునే విధంగా ఉంది. దారుణంగా దిగజారిన పోలీసు వ్యవస్థను నా 50 సంవత్సరాల రాజకీయ జీవితంలోనే చూడలేదు’’ అని అన్నారు.