న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం తాజాగా కరోనా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ గైడ్ లైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
* బెంగళూరు, మంగళూరు ఎయిర్ పోర్టుల్లో కరోనా లక్షణాలు కనిపించిన ప్రయాణికులను బెంగళూరులోని బౌరింగ్ ఆస్పత్రికి, మంగళూరులోని వెన్‌లాక్ ఆస్పత్రికి తరలించాలి. లేదా బాధిత ప్రయాణికులు క్వారంటైన్ కోసం సమీపంలోని ఆసుపత్రికి వెళ్లొచ్చు. ఆసుపత్రి ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
* ఆర్టీ-పీసీఆర్ టెస్టుకు శాంపిల్స్ ఇచ్చే ప్రయాణీకులు ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్ళవచ్చు. కానీ హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక ఆరోగ్య బృందాన్ని సంప్రదించాలి.
* సానుకూల నివేదిక, సీటీ విలువ 25 కంటే తక్కువ ఉన్న అన్ని శాంపిల్స్ ను BF.7 వేరియంట్ కాదా అని తెలుసుకోవడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తారు.
* 12 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఎయిర్ పోర్టుకు వచ్చినప్పుడు ఆరోగ్యవంతమైన తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో ఆసుపత్రిలో ఉండాలి.
* న్యూ ఇయర్ వేడుకలను అర్ధరాత్రి ఒంటి గంటలోపు పూర్తి చేసుకోవాలి. జనం ఎక్కువగా ఉండకూడదు. వీలైతే పగటిపూట సెలబ్రేట్ చేసుకోవాలి.
* సినిమా థియేటర్లలో ప్రజలు తప్పనిసరిగా N-95 మాస్కులు ధరించాలి. అన్ని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు ధరించాలి.
* బార్‌లు, రెస్టారెంట్లు, పబ్‌లలోని కస్టమర్‌లు, ఉద్యోగులు 2 డోసుల వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి ఉంటుంది.