రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 15న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్ విద్యామండలి సోమవారం పరీక్షల షెడ్యూలును ప్రకటించింది. దీని ప్రకారం.. ప్రథమ సంవత్సరం పరీక్షలు 15న, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 16న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. అన్ని పరీక్షలు ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి 25 వరకు, ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో ఉంటుందని పేర్కొంది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఫిబ్రవరి 22న, పర్యావరణ విద్య పరీక్ష ఫిబ్రవరి 24న జరుగుతాయని తెలిపింది. తాజా షెడ్యూలు జనరల్ ఇంటర్‌తో పాటు ఒకేషనల్ కోర్సులకు కూడా వర్తిస్తుందని పేర్కొంది.