తెలుగుదేశం పార్టీ ప్రవాసాంధ్ర విభాగం కృషి ఫలితంగా పదమూడు మంది నిరుద్యోగ యువతీ యువకులకు విదేశాల్లో ఉద్యోగాలు లభించాయి. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసిన వీరు ఈ విభాగంలో శిక్షణ పొంది తాజాగా అమెరికాలోని ప్రముఖ అంతర్జాతీ య హోటళ్లలో ఉద్యోగాలు పొందారు. సోమవారం గుంటూరు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విభాగం నేతలు వీరికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్ర విభాగం ఇన్చార్జి డాక్టర్ వేమూరు రవి కుమార్, పార్టీ మానవ వనరుల విభాగం చైర్మన్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యం మేరకు తాము పనిచేస్తున్నామని చెప్పారు.