పాలకొల్లు పట్టణంలోని 30వ వార్డులోని శాంతి నగర్, బ్రహ్మానంద రెడ్డి కాలనీ, సబ్ రిజిస్ట్రారు కార్యాలయం వెనుక వైపు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 14వ సచివాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. అనంతరం మునిపల్ కార్యాలయానికి వెళ్ళి కమిషనర్ ఎన్.ప్రమోద్‌కుమార్‌కు సమస్యను తెలియజేశారు. వలంటీర్, సచివాలయ కార్యదర్శి, కమిషనర్‌కు వినతి పత్రాలను అందజేశారు. శీతాకాలమే పరిస్థితి తాగునీటి కొరత ఉంటే వేసవిలో ఎన్ని ఇబ్బందులు పడాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.