BF7 రకం కరోనా ఇన్ఫెక్షన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నందున భారత్ లో 7 రోజుల పాటు కర్ఫ్యూ అమలు చేయబడుతుందని పలు యూట్యూబ్ ఛానెల్స్ లో వార్తలు వ్యాపించాయి. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర సమావేశం కూడా జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వీడియోలోని వార్తలు పుకార్లేనని, ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుత వాతావరణంలో విమానాలను రద్దు చేయాల్సిన అవసరం లేదని, కర్ఫ్యూను అమలు చేయాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.