జగన్ అసమర్ధ పాలనతో రాష్ట్రం అభి వృద్ధిలో వెనుకబడిందని, పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నాయకులు వాపోయారు. భీమవరం పట్టణంలోని 3, 10 వార్డులలో సోమవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ...... మండుతున్న ధరలు తగ్గాలంటే చంద్రబాబు తిరిగిరావాలని మహిళలు చెబుతున్నారన్నారు. మెంటే పార్థసారధి, కోళ్ళ నాగేశ్వరావు మాట్లాడుతూ.... ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రైతులకు ధాన్యం డబ్బు చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందన్నారు. మెరగాని నారాయణమ్మ, ఎండీ నౌషాద్, గంటా త్రిమూర్తులు, మామిడిశెట్టి ప్రసాదు, ఎద్దు ఏసుపాదం, గునుపూడి తిరుపాల్, మాదాసు కనకదుర్గ, సయ్యద్ నసీమాబేగం, కోళ్ల సీతారం, తదితరులు పాల్గొన్నారు.