పిల్లల చదువుల కోసం, వివాహం కోసం డబ్బును దాచుకోవడం కోసం అనేకమంది కష్టపడుతుంటారు. ఇలాంటి వారి కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీలో భాగంగా కుమార్తె పేరుపై 22 ఏళ్లపాటు నెలవారీ రూ. 3600 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 25 ఏళ్ల పాటు చెల్లిస్తే తర్వాత రూ. 26 లక్షలు పొందొచ్చు. నెలవారీ ప్రీమియంను తక్కువగా ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణం కూడా పొందొచ్చు.సెక్షన్ 10D కింద మెచ్యూరిటీ మొత్తం పన్ను రహితం. పాలసీ కాల పరిమితి 13 నుంచి 25 ఏళ్లు ఉంటుంది. ఒకవేళ పాలసీ తసుకున్న కొంత కాలానికి తండ్రి చనిపోతే ప్రీమియం మొత్తం మాఫీ అవుతుంది. దీంతో పాలసీ ఉచితంగా అమలై మెచ్యూరిటీ సమయం నాటికి మొత్తం డబ్బు నామినీకి అందుతుంది.