పశ్చిమ గోదావరి జిల్లా, ఆగిరిపల్లి, లో స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్‌పై వైసీపీ ఏర్పాటుచేసిన హీలియమ్ గ్యాస్ బెలూన్ పేలి సోమవారం ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆగిరిపల్లికి చెందిన షేక్ అలియ తన కుమార్తె షేక్ మాలిన్ (11), తమ పొరుగున ఉండే మరో చిన్నారి పరసా మల్లిక (6)ను వెంటబెట్టుకుని స్థానిక సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌కు వెళ్లింది. ఆమె బ్యాంక్‌లో పని చూసుకుంటున్న సమయంలో ఆమెతో పాటు వచ్చిన చిన్నారులు బ్యాంక్ డాబా మీదకు వెళ్లారు. అక్కడ ఉన్న బెలూన్ వద్దకు వెళ్లే సరికి అది ఒక్కసారిగా పేలి మంటలు రావడంతో చిన్నారులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స అందిస్తున్నారు. బెలూన్ ఏర్పాటు చేసిన ప్రాంతానికి దగ్గరే ఓ స్వీట్ షాపు కార్ఖానా ఉండటం బెలూన్ రెండు రోజుల కిందటే కిందికి జారిపోయి ఉండటంతో కార్ఖానా నుంచి వచ్చే వేడికి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.