విద్యావ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 29న కర్నూలు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ను చేపట్టామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీఎనఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులుతో పాటు విద్యాసంస్థల బంద్ వాల్‌పోస్టర్లను సోమిశెట్టి వెంకటేశ్వర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీఎనఎస్‌ఎఫ్ అధికార ప్రతినిధి దరూర్ రాంప్రకాష్, సురేంద్ర రెడ్డి, బెస్త జయసూర్య, రవికుమార్, శేఖర్ పాల్గొన్నారు.