ఏపీలోని సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి, ఏ కారణం చేతనైనా లబ్ధిపొందని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. నవరత్నాల పథకాల కింద అర్హత కలిగి ఉండి, గతంలో లబ్ధి పొందలేకపోయిన వారి నుంచి ప్రభుత్వం ఇటీవల దరఖాస్తులు స్వీకరించింది. వీటి ద్వారా 2.79 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. వివిధ పథకాలకు సంబంధించి 2,79 లక్షల మంది ఖాతాల్లో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి రూ.590.91 కోట్లను జమ చేశారు. అమ్మఒడి, వసతిదీవెన, వాహనమిత్ర, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ నేతన్న హస్తం తదితర పథకాల కింద ఈ డబ్బును జమ చేశారు.