ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డిని సోమవారం కర్నూలులో కలిసినట్లు చిప్పగిరి జడ్పీటీసీ విరుపాక్షి కలిశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల వైసీపీ అధ్యక్షుడు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అరగంట పాటు గెస్ట్ హౌస్లో సమావేశం అయ్యారు. మంత్రి జయరాంతో విభేదాలు, ఆయన సోదరులు, తనయులు తనను కించపరచేలా మాట్లాడంతో మనస్తాపానికి గురై రాజీనామాకు సిద్ధమైనట్లు జడ్పీపీటీసీ విరుపాక్షి వివరించారు. దీనిపై సజ్జల స్పందిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని విరుపాక్షికి సూచించినట్లు సమాచారం. ఆయన వెంట వైసీపీ నాయకులు నాగప్ప, మల్లికార్జున, ఓబులేషు ఉన్నారు.