కర్నూలు జిల్లా, కోసిగి,మండలంఓని డి. బెళగల్ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ తలారి వీరేష్ (35) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. సోమవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... ఆదివారం ఉదయం వీరేష్, ఆయన భార్య శివలింగమ్మ, ముగ్గురు పిల్లలు రాయచూరుకు వలస వెళ్లారు. తండ్రి శంకరయ్య ఆరోగ్యం బాగా లేదని తెలియడంతో అదే రోజు మధ్యాహ్నం వీరేష్ తిరిగి డి.బెళగల్‌కు వచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో కూడా ఇంటి నుంచి భార్యతో ఫోన్లో మాట్లాడాడు. అయితే మరునాడు ఉదయం పక్కన రేకులషెడ్డు సందులో వీరేష్ పడి ఉన్నట్లు తల్లి పార్వతి గుర్తించింది. తలకు, చేతులకు, చెవులకు, మర్మాంగాలకు బలమైన రక్తగాయాలయ్యాయి. ఈ వార్త తెలిసి రాయచూరు నుంచి వచ్చిన భార్య శివలింగమ్మ మాట్లాడుతూ... తన భర్తను ఎవరో హత్య చేశారని ఆరోపించింది. కాగా గ్రామస్థులు మాత్రం ఆటోడ్రైవర్‌కు వివాహేతర సంబంధం ఉండవచ్చని, అదే హత్యకు దారి తీసిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు.